తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 16:24

తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు.

కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల నేతలతో కెసిఆర్ భేటీ కానున్నారు. బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలం గాణలో రాజకీయ పరిణా మాలు మారుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 14:04

జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి కి బర్త్డే శుభాకాంక్షలు చెప్పిన గడ్డికొండరాం పార్టీ కార్యకర్తలు

గడ్డి కొండారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి గారికి బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చెన్నపాక శ్యామ్, ఉపాధ్యక్షులుసున్నం నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు భూపతి రాజు, మైనం నాగేందర్, పాలడుగు అంజనేయులు,నర్సింగ్ కృష్ణ, దొడ్డిని వెంకన్న, కందుల అశోక్, చెన్నపాక చంద్ర శేఖర్, సుంకిశాల ప్రశాంత్, కంచర్ల రమేష్ రెడ్డి, కందిమల్ల వేణుగోపాల్ రెడ్డి, భీమనపల్లి జానయ్య, భీమనపల్లి,శ్రీను, జక్కలి సతీష్, కస్పరాజు సైదులు, కస్పరాజు అనిల్, ముంత రాజు, మైనం దాసు, బుయ్య సైదులు, సుకింశాల ఇస్తారి, దూదిమెట్ల మహేష్, కస్పరాజు సత్తయ్య, నాంపల్లి వెంకన్న,జక్కలి రామలింగం, మహిళా కార్యకర్త, భీమనపల్లి మమత, మరియు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 12:02

ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా శ్రీపాదరావు పోషించిన పాత్ర మరువ లేనిదని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దుద్దిళ్ల శ్రీపాద రావు 87వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్రభారతిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా నిర్వహించిన ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పితామ హుడు, భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు రాజకీయ ప్రస్థానం మంథని నుండి మొదలు అయిందని తెలిపారు. చరిత్రలో పివికి, మంథని నియోజకవర్గనికి చాలా ప్రాముఖ్యత ఉందని, పివి అనుచరుడుగా శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం మొదలు అయింది అదే మంథని స్థానం నుండని ముఖ్యమంత్రి అన్నారు.

శ్రీపాద రావు స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రములో మంచి సంప్రదాయం నెలకొలిపారని కొనియాడారు. అసెంబ్లీ అంటే నాయకుల మధ్య గొడవ జరిగే ప్రదేశం కాదు, ప్రజల సమస్యలు ప్రస్థా వించే వేదిక అని నిరూపిం చారని కొనియాడారు.

ఇప్పుడు అసెంబ్లీ వ్యవ హారాల శాఖ మంత్రిగా శ్రీధర్‌బాబు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలాగా చూసారని కితాబునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎన్‌టిఆర్ శ్రీపాదరావు స్పీకర్‌గా ఏకగ్రీవ ఎన్నికకు సహ కరించారని గుర్తు చేశారు.

శ్రీధర్‌బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని, మొదటి సారి శ్రీపాద రావు తనయుడుగా గెలిచిన ఆయన ఆ తర్వాత ప్రతిభ, పనితనం వల్లే శ్రీధర్‌బాబు అనేక సార్లు గెలిచారన్నారు. అసెంబ్లీలో ఎవరం గొంతు విప్పాలన్నా శ్రీధర్ బాబు అనుమతి లేదా సైగ కావాలని రేవంత్ రెడ్డి సమత్కరించారు.

తండ్రికి తగ్గ తనయుడు శ్రీధర్ బాబు అని అన్నారు. ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలని ఆ మేరకు ఆలోచన ఉందన్నారు. చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటును పరిశీలిస్తామని, ఇందుకోసం త్వరలోనే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

జీవన్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, ఇతర ప్రముఖులు కోరినట్టు హైదరాబా లో తప్పకుండ శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుకు విధివిధానాలు రూపొందిస్తామన్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 12:00

Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర

విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర (Maha Padayatra) ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది..

ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే నాగి రెడ్డి, పలు రాజకీయ పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ (Privatization) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్నట్లు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలన్నారు..

కాగా విశాఖ ఉక్కును కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ అన్నారు. గురువారం గుడివాడలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఆయన రాస్తారోకో చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా కార్మిక ఉద్యమాలను నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ముఠా కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 01 2024, 08:45

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు పేర్కొన్నారు.

గత అక్టోబర్‌లో నిజామా బాద్ పర్యటనలో ప్రధాని 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభిం చిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ పవర్‌ ప్లాంట్‌తో తెలంగాణ ప్రజల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీరనున్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు.

మార్చి 4న ప్రారంభోత్సవం కానుంది. రూ.11వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీరుతాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు.

తెలంగాణ ప్రజల విద్యుత్ సమస్యలు తీరడమే కాకుండా, రైతులకు, వాణిజ్య అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం అవుతుందని మంత్రి అన్నారు.

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు క్రింద 1,600 మెగావాట్ల(2800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను మొదటి విడత (ఫేజ్-I) లో భాగంగా, 2,400 మెగావాట్ల(3800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను రెండవ విడత (ఫేజ్-II) లో భాగంగా...

పెద్దపల్లి జిల్లా రామ గుండంలో ఏర్పాటు చేయాలని NTPC నిర్ణయం తీసుకుందని. ప్రధాని చొరవతో మొదటి విడత 1600 మెగావాట్ల విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Feb 29 2024, 18:34

సూపర్ పోలీస్

2 కిలోమిటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు ‌కాపాడిన పోలీసు వివరాలు ఇలా ఉన్నాయి..

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఈరోజు కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవ పడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.

అది గమనించిన రైతులు 100కి‌ సమాచారం ఇవ్వగా బ్లూకోర్ట్ సిబ్బంది జయపాల్ అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ ని తన భూజాలపై వేసుకొని పొలాల గట్ల వెంబడి 2 కిలోమీటర్ల మోసుకొని గ్రామంలోకి వెళ్ళాడు.

జమ్మికుంట ఆసుపత్రి కి తరలించగా సురేష్ కి‌ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Feb 29 2024, 16:00

వైసీపీలో చేరిన IAS అధికారి

కర్నూల్ మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ఈ రోజు వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవల వీఆర్ఎస్ కు దర ఖాస్తు చేసుకోగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఇంతియాజ్ స్వస్థలం కర్నూల్ జిల్లాలోని కోడమూరు. అయితే ఇంతియాజ్ ను కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది.

ఆయనకు ఉన్న పరిచయా లతో గెలవగలరు అని వైసీపీ భావిస్తోంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Feb 29 2024, 14:59

ఉద్యోగం కోసం మాజీ మహిళ హోంగార్డు ఆమరణ దీక్ష

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మాజీ మహిళ హోంగార్డు మామిడి పద్మ గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

తొలగించిన తన హోంగార్డ్ ఉద్యోగం తనకు ఇప్పించా లని ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు గత కొన్ని రోజులుగా వివిధ రూపాలుగా నిరసనలు, ఆందోళనలతో పాటు ప్రభుత్వాన్ని వేడుకుంటు న్నారు.

తన కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి,అనారోగ్యం దృష్ట్యా కొద్దిరోజులుగా ఉద్యోగం రాలేకపోయానని నాపై దయ తలచి పోలీసు అధికారులు తనకు ఉద్యోగం ఇప్పించాలని పద్మ వేడుకుంటుంది....

తప్పు చేస్తే దొరకక తప్పదు

Feb 28 2024, 18:58

సిద్దిపేట జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు

 సిద్దిపేట జిల్లాలో బుధ వారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

జిల్లావ్యాప్తంగా 44 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యా ర్థులకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు జరిగింది. సెట్‌ ఏ ప్రశ్న పత్రాన్ని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

జిల్లావ్యాప్తంగా 11,039 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,328 (94 శాతం) మంది హాజరు కాగా. 711 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులకు సంబంధించి 8864 మందికి గాను 8419 మంది (95 శాతం) హాజరు కాగా 95 మంది గైర్హాజరయ్యారు.

ఒకేషనల్‌ విద్యార్థులకు సంబంధించి 2175 మందికి గాను 1909 మంది (88 శాతం) హాజరు కాగా 88 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రగతి ఒకేషనల్ కళాశాల, న్యూ జెనరేషన్ కళాశాల, ఎన్సాన్ పల్లి టీఎస్ డబ్ల్యూఆర్ జే సీ కళాశాల పరీక్షా కేంద్రాలను డీఐఈవో సూర్య ప్రకాష్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.

అదే విధంగా పోలీస్ కమిషనర్ డా. బీ అనురాధ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను సందర్శిం చి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Feb 28 2024, 18:57

తెలంగాణలో 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

రెవెన్యూ శాఖలో మరో భారీ కుదుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 40 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీవో స్థాయి అధికారులకు పెద్దగా పనులేం లేవన్న అభిప్రా యం నెలకొన్నది. కానీ ఇప్పుడీ బదిలీల తీరును బట్టి త్వరలోనే భూ పరిపాలనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయని సమాచారం.

దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తోన్న వారిని, ఆరోపణలు ఎదుర్కొన్న వారికి స్థానచ లనం లభించింది. అలాగే ఇద్దరిని హెచ్ఎం డీఏలోకి తీసుకోవడం గమనార్హం. ఇంకొందరిని భూ సేకరణ బాధ్యతలు అప్పగించారు.

వెయిటింగ్‌లో ఉన్న వారిని కూడా అకామిడేట్ చేయడం గమనార్హం. ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.